57 పాఠశాలలకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:53 AM
జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్ ఇచ్చింది.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్ ఇచ్చింది. ం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. శుక్రవారం సాయంత్రంలోపు అర్హత కలిగిన వారు మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్‌సీ)లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలించి డీఈవో కార్యాలయానికి పంపుతారు. అక్కడ వాటిని పునఃపరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సోమవారం వీరంతా విద్యా వాలంటీర్లుగా కేటాయించిన పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా విధులు చేరాల్సి ఉంది.