Home » Telugu Desam Party
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్‌లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్‌లో దొరికినా, అక్రమ సంపాదనలు వెలుగు చూసినా అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.
నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు.
గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.
తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.
ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు జగన్ అండ్ కో శ్రీరంగ నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. సీబీఐ ఈడీ క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ప్రజాస్వామ్యం అంటూ నీతి సూత్రాలు చెబుతున్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు.