Home » Telugu Desam Party
జగన్ తన హయాంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నడిపారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. మహిళలు ఓట్లు వేయలేదని, ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా కల్పించలేదనే అక్కసుతోనే జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.
విశాఖను టూరిజం హబ్‌గా, ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు తెరిచే లోపు...తల్లికి వందనం ఇస్తామని చెప్పామని అలాగే మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్‌లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి మాజీ సీఎం జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ తన సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసి కోర్టుకు ఈడ్చారని లోకేష్ ఫైర్ అయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
విజయవాడ పోలీసు కమిషనర్‌ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు సోమవారం కలిశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై సీపీకి ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలను అభ్యతరకరంగా ధూషించిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీకి వినతి పత్రం ఇచ్చారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.
రాజధాని రైతుల మనోభావాలను దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. కృష్ణంరాజుపై వెంటనే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వడ్డే శోభనాద్రీశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు.
రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే కృష్ణంరాజు అటువంటి వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.