AP News: గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం..
ABN , Publish Date - Aug 12 , 2025 | 03:53 PM
ఈ మేరకు ప్రతి గ్రామంలో ఫేకల్ స్లజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 77 FSTP ప్లాంట్ల నిర్మాణానికి రూ.115.5 కోట్ల మంజూరు చేస్తూ.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది
నెల్లూరు: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిలువలపై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ప్రతి గ్రామంలో ఫేకల్ స్లజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 77 FSTP ప్లాంట్ల నిర్మాణానికి రూ.115.5 కోట్ల మంజూరు చేస్తూ.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది. ఈ FSTP ప్లాంట్ల ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంది. కాగా, ప్లాంట్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా.. నిర్మాణాలు చేపట్టాలని సూచిస్తుంది. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. టెండర్ల విషయంలో కూడా ఎలాంటి అవనీతి జరగకుండా.. గుర్తింపు ఉన్న కంపెనీలకు టెండర్లు కేటాయించాలని తెలుపుతుంది. నిర్మాణ సమయంలో ఎమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తుంది.
వార్తలు కూడా చదవండి..
ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు
ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు