Home » Telangana
అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్ సర్వే ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్ డి.వేణు, ఇరిగేషన్ ఈఈ బలరాం, ఫారెస్ట్ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు.
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొదటి రోజు ఆసిఫాబాద్ మండలంలో సర్పం చ్‌కు 9, వార్డులకు 32, కాగజ్‌నగర్‌లో సర్పంచ్‌కు 19, వార్డులకు 48, రెబ్బెనలో సర్పంచ్‌కు 19, వార్డులకు 18, తిర్యాణిలో సర్పంచ్‌కు 7, వార్డులకు 8 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి.
పంచాయతీ ఎన్నికల వేళ సోషల్ వార్ మొదలైంది. సామాజిక మాధ్యమ వేదికగా పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పోస్టులు, కామెంట్లు ప్రత్యక్షమవుతున్నాయి. పంచా యతీ ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో పార్టీ శ్రేణులు, అభ్యర్థుల అనుచరులు యాక్టివ్ అయ్యారు.
జిల్లాలో కొసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం పంచాయతీ రాజ్, రహదారుల, భవనాల శాఖ, ఈడబ్ల్యూఐడీసీ, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ అఽధికారులు, ఇతర అన్ని విభాగాల అధికారులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహఙంచారు
మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో బుధవారం సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్ నిర్వాహణకు ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ అర్టీవో లోకేశ్వర్‌రావ్‌తో పాటు కలిసి కలెక్టర్ పరిశీలించారు.
పంచాయతీల ఎన్నికల వేళ కొంత మేర గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరనుంది. సుమారు రెండేళ్లుగా పంచాయతీల్లో పాలక వర్గం లేక పోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల పేర ఏ విధమైన బకాయిలు ఉండకూడన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే ఇది సాధ్యమైంది. నామినేషన్ పత్రాలతో పాటు ఇంటి పన్ను, ఇతరాత్రా పన్నులనీ చెల్లించినట్లు పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జత పర్చాల్సి ఉంటుంది.
2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్‌లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ విలీనం చేయనుంది.