Share News

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:30 PM

రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్‌ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టాల్‌లు ఏర్పాటు చేశారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్‌ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టాల్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ మహిళలకు అత్యున్నత స్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పి స్తుందని, మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నామన్నారు. మహిళల పై వేధింపులు, గృహహింస చర్యలపై సఖి కేంద్రాలు ఉన్నాయని, వీటితోపాటు అనాథ పిల్లల కోసం హాస్టల్‌లు ఏర్పాటు చేసి ఉచిత వసతితో విద్యాబోధన అందిస్తున్నామ న్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపిం చకుండా చదివించాలన్నారు. ఎంపిడివో కొప్పుల శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ రోజా రాణి, సిడిపిఓ కవిత, అంగన్‌వాడి టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:30 PM