Share News

సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:29 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచిం చారు. పెద్దబొంకూరు మథర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాలలో సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు.

సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

పెద్దపల్లి రూరల్‌ , ఫిబ్రవరి 19 (ఆంఽధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచిం చారు. పెద్దబొంకూరు మథర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాలలో సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య హాజరై సర్పంచ్‌లకు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతిని ధులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని , పంచాయతీ పరిపాలనలో పార దర్శకత, బాధ్యతాయుతమైన నిర్వహణకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సర్పంచ్‌లకు వివరించారు. అంతర్గాం, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, మంథని, ముత్తారం మండలాల సర్పంచ్‌లు శిక్షణకు హాజరయ్యారు. పెద్దపల్లి, మంథని డిఎల్‌పీవోలు దేవకీదేవి, కొము రయ్య, ఏపీడీ సత్యనారాయణ, ఎస్‌బిఎం రాఘవులు, పలు మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

చిన్నారి ఆడించిన డీఎల్‌పీవో

సర్పంచ్‌ల శిక్షణకు జూలపల్లి మండలం కాచాపూర్‌ మహిళా సర్పంచ్‌ పెంట కావేరి-కి షోర్‌ నాలుగు నెలల కుమారుడు మహన్స్‌తో హాజర య్యారు. ఒకవైపు శిక్షణ పొందుతూనే మరోవైపు మాతృత్వ బాధ్యతలను నిర్వర్తిస్తుం డడం ఆకట్టుకుంది. చిన్నారిని పెద్దపల్లి డివిజనల్‌ పంచాయతీ అధికారి దేవకీదేవి ఎత్తుకొని కాసేపు ఆడించారు.

Updated Date - Feb 19 , 2026 | 11:29 PM