• Home » Telangana

Telangana

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రేపు బీజేపీ నిరసనలు

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రేపు బీజేపీ నిరసనలు

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు, కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కార్యకర్తలను సన్నద్ధం చేసేం దుకు మంగళవారం పొత్కపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మెరుగైన వైద్యసేవలు అందించండి

మెరుగైన వైద్యసేవలు అందించండి

మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని డీ అడిక్షన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు.

దసరా నాటికి సొంతిల్లు అందజేస్తాం

దసరా నాటికి సొంతిల్లు అందజేస్తాం

దసరా పండుగ నాటికి డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేసి, అర్హులైన లబ్ధిదా రులకు సొంతింటి తాళాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ మేయర్‌ మహంకాళి స్వామి తెలిపారు. మం గళవారం డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పను లను లబ్ధిదారులతో కలిసి మేయర్‌ పరిశీలిం చారు

kumaram bheem asifabad-పోషణ.. ఆరోగ్యానికి బాసట

kumaram bheem asifabad-పోషణ.. ఆరోగ్యానికి బాసట

ఆరోగ్యకరమైన సమాజానికి పౌష్టికా హారమే పునాది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమయానికి ఆహారం అందించడంతో పాటు రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐసీడిఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

kumaram bheem asifabad- సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాద్యం

kumaram bheem asifabad- సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాద్యం

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం మండల ప్రత్యేకాధికారి అబ్దుల్‌ నదీం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ 45రోజులకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులంతా హాజరై సభ్యులు అడిగిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు

kumaram bheem asifabad- విద్యుత్‌ సరఫరాలో విఫలం

kumaram bheem asifabad- విద్యుత్‌ సరఫరాలో విఫలం

వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. కౌటాలలోని 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను కార్యకర్తలతో మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా లాక్‌ బుక్‌లను పరిశీలించారు.

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ కె హరిత హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీ, సీహెసీలను మంగళవారం కలెక్టర్‌ హరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు

kumaram bheem asifabad- చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

kumaram bheem asifabad- చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అక్టోబరు మొదటి వారంలో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధ మైంది.

తుమ్మిడిహట్టి బ్యారేజీకి అనుమతులు ఇప్పించండి.. కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి..

తుమ్మిడిహట్టి బ్యారేజీకి అనుమతులు ఇప్పించండి.. కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి..

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాల‌ని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మంగళవారం నాడు జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

గణేశ్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిల గుర్తింపు

గణేశ్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిల గుర్తింపు

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలను వేధించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 2,935 మంది ఆకతాయిలను గుర్తించి నిందితులకు శిక్షలు పడేలా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి