Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 01 , 2026 | 07:31 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 01, 2026 21:56 IST

    సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మూడేళ్ల బాలుడి కిడ్నాప్‌

    • తల్లితో పాటు నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు

    • సీసీ కెమెరాల్లో రికార్డైన బాలుడి కిడ్నాప్‌ దృశ్యాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు

  • Jul 01, 2026 21:45 IST

    బాపట్ల: చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్

    • తల్లి దగ్గర నిద్రిస్తున్న మగ శిశువుని ఎత్తుకెళ్లిన దుండగుడు

    • శిశువు అపహరణ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు

    • చీరాల టూటౌన్‌ పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు

    • సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

  • Jul 01, 2026 20:59 IST

    RS ప్రవీణ్‌ కుమార్‌కు మంత్రి అడ్లూరి కౌంటర్‌

    • సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందని గతంలో R.S. ప్రవీణ్‌కుమార్ ఆరోపణలు

    • హరీష్‌రావు, కేటీఆర్‌ వస్తే చర్చకు సిద్ధం: మంత్రి అడ్లూరి

    • ప్రవీణ్ ఒక్కరే వస్తే మా అధికార ప్రతినిధులు చాలు: మంత్రి అడ్లూరి

    • ఆధారాలతో అమరవీరుల స్థూపం దగ్గర సిద్ధంగా ఉంటా: మంత్రి అడ్లూరి

  • Jul 01, 2026 20:57 IST

    ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ లేఖ

    • VB-G RAM G చట్టంలో కొన్ని సవరణలు చేయాలంటూ విజయ్‌ లేఖ

    • రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హౌసింగ్‌ బోర్డు నిర్మాణాన్ని పథకంలో చేర్చాలంటూ లేఖ

    • వేతనాలు, అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులను కేంద్రం భరించాలి: విజయ్‌

    • నిర్మాణాలకయ్యే ఖర్చులను 75:25 నిష్పత్తిగా మార్చాలి: విజయ్

  • Jul 01, 2026 20:15 IST

    వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు కేంద్రం బ్రేకులు!

    • ఈ ఫీచర్‌ను లాంఛ్ చేయొద్దని కేంద్రం ఆదేశించినట్టు జాతీయ మీడియా కథనాలు

    • ఈ అంశంపై మరిన్ని సంప్రదింపులు జరపాలని భావిస్తున్న కేంద్రం

    • సంప్రదింపుల తరవాతే యూజర్‌నేమ్ ఫీచర్‌పై తుది నిర్ణయం

    పూర్తి కథనం..

  • Jul 01, 2026 20:14 IST

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్మార్ట్: సీఎం చంద్రబాబు

    • ఏ గ్లోబల్ టాలెంట్ అయినా అందిపుచ్చుకునే సత్తా ఆంధ్రులది: సీఎం చంద్రబాబు

    • దేశంలోనే ఇంజినీరింగ్ విద్య ఎక్కువ చదివేది ఏపీలోనే: సీఎం చంద్రబాబు

    • నాదెళ్ళ సత్య కూడా ఏపీలో పనిచేసిన వ్యక్తి : సీఎం చంద్రబాబు

    • దేశంలోని అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏపీ: సీఎం చంద్రబాబు

    • సీ పోర్టు ఎక్కువగా ఉన్నది దేశంలోని ఏపీలోనే : సీఎం చంద్రబాబు

    • దుగ్గరాజుపట్నం కూడా త్వరలో రాబోతోంది: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Jul 01, 2026 20:11 IST

    ఏపీలో రూ.750 కోట్ల పెట్టుబడులు: హీరో మోటార్స్‌ చైర్మన్‌ పవన్‌ ముంజల్‌

    • రానున్న 3-5 ఏళ్లలో రూ.3,200 కోట్ల పెట్టుబడులు: పవన్‌ ముంజల్

    • 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: హీరో చైర్మన్‌ పవన్‌ ముంజల్‌

  • Jul 01, 2026 20:00 IST

    తిరుపతి: మాదనపాలెంలో హీరో మోటార్స్‌ సంస్థకు శంకుస్థాపన

    • హీరో మోటార్స్‌ పరిశ్రమకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

    • రూ.750 కోట్లతో హీరో మోటార్స్‌ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ నిర్మాణం

  • Jul 01, 2026 19:09 IST

    వాక్ స్వాతంత్య్ర అర్థం వ్యక్తిత్వ హననం కాదు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

    • ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే హక్కును స్వాగతిస్తాం: పవన్‌ కల్యాణ్

    • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

  • Jul 01, 2026 18:55 IST

    కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: మంత్రి జూపల్లి

    • అప్పులపై చర్చకు సిద్ధం: మంత్రి జూపల్లి

    • రేపు ఉదయం 11 గంటలకు BRS ఆఫీస్‌కు వెళ్తా: జూపల్లి

    • చర్చకు కేటీఆర్‌ సిద్ధంగా ఉండాలి: మంత్రి జూపల్లి

    • KTR చెప్పింది నిజమైతే పదవికి రాజీనామా చేస్తా: జూపల్లి

  • Jul 01, 2026 18:53 IST

    జమ్మూకశ్మీర్‌ అనంతనాగ్‌లో వరద బీభత్సం

    • లార్నూలోని గురిద్రమన్‌ గ్రామాన్ని ముంచెత్తిన వరదలు

    • స్కూల్ విద్యార్థులను కాపాడిన గ్రామస్తులు

    • SDRFతో కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jul 01, 2026 18:30 IST

    ఏపీలో 18 నగర వనాలు, ఎకో పార్కులను వర్చువల్‌గా ప్రారంభించిన పవన్‌

    • హాజరైన మంత్రులు ఆనం, అనగాని, సవిత

    • 'నగర వన యోజన' కింద అభివృద్ధి: డిప్యూటీ సీఎం పవన్‌

    • కోడూరు, కైలాసగిరి, మదనపల్లెలో ఎర్రచందనం పరిరక్షణ పార్కులు

  • Jul 01, 2026 18:15 IST

    తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు

    • తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో 12 గేట్ల ఎత్తివేత

    • అక్టోబర్‌ 28 వరకు కొనసాగనున్న నీటి విడుదల

    • బాబ్లీ నుంచి గోదావరి ప్రవాహంతో శ్రీరామ్‌సాగర్‌లో జలకళ

  • Jul 01, 2026 18:00 IST

    మెదక్ జిల్లా: భార్యాభర్తలను కాటు వేసిన పాము

    • భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

    • మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బోడగట్టు గ్రామంలో ఘటన

    • సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో భార్య కవిత మృతి

    • దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు

  • Jul 01, 2026 17:45 IST

    బెల్జియంలోని యాంట్‌వెర్ప్‌లో అగ్నిప్రమాదం

    • 10 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

    • ప్రమాదంలో పలువురు మృతిచెందినట్లు సమాచారం

    • భవనంలో 200 మందికి పైగా ఉన్నట్లు అంచనా

    • మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

  • Jul 01, 2026 17:30 IST

    ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష

    • ఎన్‌బీఈఎంఎస్‌ అధికారిక ప్రకటన

    • సాయంత్రం 5 నుంచి దరఖాస్తులు

    • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

    • అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి

  • Jul 01, 2026 17:25 IST

    సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది: హరీశ్ రావు

    • కోల్ ఇండియా విధానాలనే సింగరేణిలో అమలుచేయాలి: హరీశ్ రావు

    • సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులను జెన్‌కోకు ఇచ్చేలా కుట్ర: హరీశ్ రావు

    • సింగరేణి సంస్థను ఆగం చేస్తున్నారు: హరీశ్ రావు

  • Jul 01, 2026 17:17 IST

    యూరియా యాప్ వల్లే అక్రమాలకు అడ్డుకట్ట: మంత్రి తుమ్మల

    • యూరియా అక్రమాలను సహించేది లేదు: మంత్రి తుమ్మల

    • ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసమే యూరియా యాప్‌

    • రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాజీపడం: మంత్రి తుమ్మల

  • Jul 01, 2026 17:15 IST

    ములుగు: చిన్నబోయినపల్లిలో మరో రోడ్డు ప్రమాదం

    • ఎదురెదురుగా ఢీకొన్న రెండు ఇసుక టిప్పర్లు

    • ఓ టిప్పర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్

    • డ్రైవర్‌ను బయటికి తీసి, ఆస్పత్రికి తరలింపు

    • నిన్న రాత్రి ఇదే రహదారిపై లారీ ఢీకొని ఒకరి మృతి

    • వరుస ప్రమాదాలతో ఆందోళనలో గ్రామస్తులు

  • Jul 01, 2026 16:50 IST

    అమరావతి: త్వరలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్

    • మరో యువగళం హామీ నెరవేర్చే దిశగా మంత్రి లోకేశ్ కసరత్తు

    • అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుచేయాలని లోకేశ్‌కు గతంలో న్యాయవాదుల విజ్ఞప్తి

    • చట్ట రూపకల్పనకు మంత్రి ఫరూక్‌తో లోకేశ్ చర్చలు

  • Jul 01, 2026 16:49 IST

    కేటీఆర్‌ ఫ్రీగా ఉన్నారు కాబట్టి చర్చలకు వస్తారు: జగ్గారెడ్డి

    • పరిపాలనలో సీఎం రేవంత్‌ బిజీగా ఉన్నారు: జగ్గారెడ్డి

    • కేసీఆర్‌ చేసిన అప్పులకు అసలు, వడ్డీ కడుతున్నాం: జగ్గారెడ్డి

    • రుణమాఫీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి: జగ్గారెడ్డి

  • Jul 01, 2026 16:26 IST

    నెల్లూరు: చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో పెన్షన్ల పంపిణీ

    • లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

    • చుండు పద్మావతి, పాలేపాటి తులసమ్మకు పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం

  • Jul 01, 2026 16:15 IST

    TMC ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

    • బెంగాల్‌: పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉండగా ఘటన

    • మహువాపై కోడిగుడ్లతో ఆందోళనకారుల దాడి

  • Jul 01, 2026 16:00 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 444 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 140 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Jul 01, 2026 15:51 IST

    రేవంత్‌ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: మాజీ మంత్రి కేటీఆర్‌

    • BRSపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: కేటీఆర్‌

    • ఒక్క మంచిపని చేసినట్లయినా చెప్పుకోగలుగుతున్నారా?

    • రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి ఉన్నారా?: కేటీఆర్‌

    • ఢిల్లీకి 72 సార్లు వెళ్లి రేవంత్‌ ఏం సాధించారు?: కేటీఆర్‌

    • ఢిల్లీకి మూటలు మోయడం తప్ప చేసిందేమీ లేదు: మాజీ మంత్రి కేటీఆర్‌

  • Jul 01, 2026 15:50 IST

    ఫిషరీస్‌ సైన్స్‌ విద్యార్థులకు.. అండగా ప్రభుత్వం: మంత్రి శ్రీహరి

    • BFSc పట్టభద్రులకు ఉపాధి కల్పనకు చర్యలు: వాకిటి శ్రీహరి

    • మత్స్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు: వాకిటి శ్రీహరి

    • చేప పిల్లల ఉత్పత్తిలో యువతకు అవకాశాలు: వాకిటి శ్రీహరి

    • మత్స్య శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నాం: మంత్రి వాకిటి శ్రీహరి

  • Jul 01, 2026 15:49 IST

    పంజాబ్‌: బఠిండాలో రోడ్డు ప్రమాదం

    • ఆగివున్న లారీని ఢీకొన్న భక్తుల వాహనం

    • ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

  • Jul 01, 2026 15:06 IST

    ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల

    • ఇంజినీరింగ్‌లో 1,82,317 మంది అర్హత

    • అగ్రి, ఫార్మాలో 63,546 మంది అర్హత

    • 'X'లో ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్

    • వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ఫలితాలు లభ్యం

    పూర్తి కథనం..

  • Jul 01, 2026 15:03 IST

    ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

    • సినిమా పాటల కాపీరైట్ వివాదంలో గతంలో జారీచేసిన మధ్యంతర నిషేధాజ్ఞ(ఇంజంక్షన్)ను ఎత్తివేయాలని పిటిషన్‌

    • ఇళయరాజా పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

    పూర్తి కథనం..

  • Jul 01, 2026 14:01 IST

    పల్నాడు: జగన్ తీరుపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం

    • అసెంబ్లీ సాక్షిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పారు: లక్ష్మీనారాయణ

    • అధికారంలోకి రాగానే మాట మార్చి 3 రాజధానులని అన్నారు: లక్ష్మీనారాయణ

    • అధికారం పోగానే మావిగన్ అని కొత్త రాగం ఎంచుకున్నారు: లక్ష్మీనారాయణ

    • ప్రజలు గుణపాఠం చెప్పినా.. జగన్‌ బుద్ధి మారలేదు: లక్ష్మీనారాయణ

  • Jul 01, 2026 14:00 IST

    హైదరాబాద్: రాజగోపాల్‌రెడ్డి వివాదంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

    • బోర్డు మెంబర్ల అంశం తనతో చెప్తే బాగుండేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు: మహేష్‌గౌడ్

    • రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయాన్ని సీఎంకు వివరిస్తా: మహేష్‌గౌడ్

    • మునుగోడు నియోజకవర్గం వ్యక్తి కూడా బోర్డులో ఉన్నారు: మహేష్‌గౌడ్

    • భువనగిరి పార్లమెంట్ నుంచి బోర్డులో ఇద్దరు ఉన్నారు: మహేష్‌గౌడ్

    • అన్ని విషయాల్లో అందరి నిర్ణయాలు తీసుకోలేం: మహేష్‌గౌడ్

    • టీటీడీలో తెలంగాణ వారు లేరా?: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

  • Jul 01, 2026 13:57 IST

    తమిళనాడు: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం

    • 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం

    • ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు సహా ముగ్గురు అరెస్ట్

    • మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు

    • కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తు

  • Jul 01, 2026 13:54 IST

    నెల్లూరు: వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణించిన సీఎం చంద్రబాబు

    • గత ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందని విమర్శ

    • అమరావతిపై వైసీపీ విషం కక్కుతోందని విమర్శించిన సీఎం

    • మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేశారు: సీఎం

    • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అసభ్య పోస్టులు పెట్టారు: సీఎం

    • గంజాయి బ్యాచ్‌లు, సైకోలకు వైసీపీ అండగా ఉంది: సీఎం

    • రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు: సీఎం

    • అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం

  • Jul 01, 2026 13:34 IST

    ఉస్మానియా వైద్యులు మరోసారి చరిత్ర సృష్టించారు

    • దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి 5 అవయవాల మార్పిడి చికిత్స చేశారు

    • 36 గంటల పాటు కొనసాగిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స

    • సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు విజయవంతంగా అవయవాల మార్పిడి చికిత్స

    • ఉస్మానియా వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

    • తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను పెంచిన ఘనతగా మంత్రి ప్రశంసలు

  • Jul 01, 2026 13:23 IST

    విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇద్దరికి రిమాండ్

    • క్రైమ్ కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యకు 14 రోజుల రిమాండ్

    • నిందితులను అవనిగడ్డ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం

    • సీసీటీవీ హార్డ్‌డిస్కులు మార్చి సాక్ష్యాలు ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్ట్

    • సాయికృష్ణ మృతదేహం ఆచూకీ ఇంకా తెలియలేదని వెల్లడి

    • నిందితులు విచారణకు సహకరించడం లేదని పోలీసుల నివేదిక

    • సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్ట్

  • Jul 01, 2026 13:19 IST

    తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

    • 12ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి: మహేష్‌గౌడ్

    • కాంగ్రెస్ నేతల కృషి వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది: మహేష్‌గౌడ్

    • కాంగ్రెస్ మినహా ఏ పార్టీకి తెలంగాణలో చోటు లేదు: మహేష్‌గౌడ్

  • Jul 01, 2026 13:03 IST

    వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి: జగన్

    • మావిగన్‌కు మేం కట్టుబడి ఉన్నాం: జగన్

    • మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం: జగన్

    • ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందాం: జగన్

    • ప్రజా సమస్యలపై ఎవరు కలిసొచ్చినా పొరాడుతాం: జగన్

  • Jul 01, 2026 13:02 IST

    గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

    • హిందూ వివాహాల చెల్లుబాటుపై కీలక మార్గదర్శకాలు

    • రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదన్న హైకోర్టు

    • మతాలను బట్టి సాంప్రదాయాలు తప్పనిసరన్న హైకోర్టు

    • హిందూ వివాహ చట్టం ప్రకారం ఏడు అడుగులు నడవకపోతే పెళ్లి చట్టబద్ధం కాదన్న హైకోర్టు

  • Jul 01, 2026 13:01 IST

    దేశవ్యాప్తంగా అమల్లోకి VB-G RAM G చట్టం

    • MGNREGA స్థానంలో అమల్లోకి VB-G RAM G చట్టం

    • రేపు తిరుపతిలో VB-G RAM G ప్రారంభం

    • రోజువారీ కనీస వేతనం రూ.300 ఖరారు

    • ఏడాదికి పనిదినాల సంఖ్య 100 నుంచి 125కు పెంపు

  • Jul 01, 2026 13:00 IST

    హైదరాబాద్: యాదగిరిగుట్ట బోర్డు మెంబర్లను నియమించేటప్పుడు నాకు చెప్పరా?: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

    • మునుగోడు నుంచి ఒక వ్యక్తిని మెంబర్‌గా వేశారు: రాజగోపాల్‌రెడ్డి

    • మెంబర్‌గా వేసిన విషయం నాకు తెలియనే తెలియదు: రాజగోపాల్‌రెడ్డి

    • నేను యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేను, సీనియర్ కాంగ్రెస్ నేతను: రాజగోపాల్‌రెడ్డి

    • నా అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే ఎలా?: రాజగోపాల్‌రెడ్డి

  • Jul 01, 2026 12:59 IST

    హైదరాబాద్: ప్రభుత్వ పెద్దల వ్యవహారం సరిగాలేదు: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

    • రాహుల్ గాంధీని కలిసి అన్ని విషయాలు చెప్పా: రాజగోపాల్‌

    • మహేష్‌గౌడ్, మీనాక్షిని కలిసి అన్ని విషయాలు వివరిస్తా: రాజగోపాల్‌

    • హైదరాబాద్‌లో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా?: రాజగోపాల్

    • వీరి వ్యవహారం నచ్చకనే ఇటీవల నల్లగొండ మీటింగ్‌కు వెళ్లలేదు: రాజగోపాల్

  • Jul 01, 2026 12:56 IST

    బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    • ప్రతివాదిగా ఉన్న ఫిర్యాదురాలికి హైకోర్టు నోటీసులు

    • తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు

  • Jul 01, 2026 12:50 IST

    అనంతపురం: సెంట్రల్‌ వర్సిటీ తొలి స్నాతకోత్సవం

    • పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి లోకేశ్

    • పతకాలు సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు: లోకేశ్

    • భవిష్యత్‌ కలల సాకారానికి ఇదో వేదిక: లోకేశ్

    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం: లోకేశ్

    • మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ద్రౌపది ముర్ము స్వయం కృషితో ఎదిగారు: లోకేశ్

    • విద్యార్థులను భవిష్యత్‌ నాయకులుగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

    • నూతన సాంకేతికత అభివృద్ధిలో యువత దూసుకెళ్లాలి: లోకేశ్

  • Jul 01, 2026 11:44 IST

    అమల్లోకి ఉద్యోగ భవిష్య నిధి, పెన్షన్ కొత్త పథకాలు

    • కొత్త పథకాలపై గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

  • Jul 01, 2026 11:43 IST

    అన్నమయ్య జిల్లా: ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

    • రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం

    • గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

    • దర్యాప్తు చేసి భార్య, ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • మదనపల్లి మండలం నారమాకుల తండాలో ఘటన

  • Jul 01, 2026 11:30 IST

    GST వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

    • తెలంగాణలో జూన్ నెల GST వసూళ్లలో 11 శాతం వృద్ధి

    • జూన్ నెలలో తెలంగాణకు రూ.5,050కోట్లు, ఏపీకి రూ.3,548 కోట్ల(5శాతం వృద్ధి) GST ఆదాయం

    • ఏపీకి పోస్ట్-సెటిల్‌మెంట్ SGST కింద రూ.3,144 కోట్లు

    • తెలంగాణకు సెటిల్‌మెంట్ తర్వాత SGST కింద రూ.3,994 కోట్లు

  • Jul 01, 2026 10:59 IST

    ఏలూరు: వేలేరుపాడు మండలంలో పెద్దపులి కలకలం

    • తెల్లవారుజామున చింతలపాడు సమీపంలో ఆవును చంపిన పెద్దపులి

    • పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని అధికారుల నిర్ణయం

    • సమీప అటవీ ప్రాంతాల్లో ప్రజలు తిరగొద్దని అధికారుల హెచ్చరిక

    • పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా పులి కదలికలు పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

    • ప్రస్తుతం యడవల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తింపు

  • Jul 01, 2026 10:58 IST

    కాకినాడ: ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ

    • చిన్నారి ఆచూకీ కోసం వాల్‌పోస్టర్లు విడుదల చేసిన పోలీసులు

    • చుట్టుపక్క జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో చిన్నారి ఫొటోతో పోస్టర్లు

    • చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే రూ.లక్ష పారితోషికం

    • ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటన

    • 12 బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

  • Jul 01, 2026 10:57 IST

    కాకినాడ: డిప్యూటీ సీఎం పవన్‌పై విమర్శలు చేసిన రావణ్ అరెస్ట్

    • హైదరాబాద్‌లో అర్ధరాత్రి రావణ్‌ను అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు

    • ప్రస్తుతం పిఠాపురం స్టేషన్‌లో రావణ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

    • రావణ్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశం

  • Jul 01, 2026 10:56 IST

    కర్నూలు: రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి: మంత్రి టీజీ భరత్‌

    • కర్నూలు జిల్లాకు పరిశ్రమలు తీసుకొస్తున్నాం: మంత్రి టీజీ భరత్‌

    • త్వరలో రూ.300 కోట్లతో ఈవీ వెహికల్ కంపెనీ రాబోతుంది: భరత్‌

    • హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి టీజీ భరత్

  • Jul 01, 2026 10:56 IST

    నిజామాబాద్‌: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

    • గుండెపోటుతో మృతి చెందినట్లు నాటకం ఆడిన భార్య

    • మెడపై గాయాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు

    • కేసు నమోదు చేసి భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jul 01, 2026 10:54 IST

    అత్తాపూర్‌లో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

    • ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

    • నిందితుల నుంచి 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం

    • మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసుల వెల్లడి

    • సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు

    • జల్సాలు, చెడు వ్యసనాల కోసమే బైక్ చోరీలకు పాల్పడినట్లు గుర్తింపు

    • పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్న పోలీసులు

  • Jul 01, 2026 10:51 IST

    అమరావతి: నేడు కృష్ణా డెల్టాకు నీటి విడుదల

    • కాసేపట్లో నీటిని విడుదల చేయనున్న మంత్రి రామానాయుడు

    • కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3,200 క్యూసెక్కుల నీటి విడుదల

    • పులిచింతల ప్రాజెక్టు నీటిని డెల్టా అవసరాలకు వినియోగిస్తున్న అధికారులు

    • శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వచ్చే వరకు పులిచింతలే ఆధారం

  • Jul 01, 2026 10:49 IST

    కర్ణాటక: మంగళూరులో భారీ వర్షాలు

    • వర్షాలతో కూలిన ఇల్లు, ముగ్గురి మృతి

    • ఘటనాస్థలిలో NDRF, SDRF సహాయక చర్యలు

    • శిథిలాల కింద మరో ముగ్గురిని రక్షించిన సిబ్బంది

  • Jul 01, 2026 10:45 IST

    సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో డంపింగ్ యార్డ్ గొడవ

    • 15 రోజులుగా బీదర్ మున్సిపల్ చెత్తను అడ్డుకుంటున్న మల్గి గ్రామస్థులు

    • బీదర్‌లో చెత్తంతా తమ గ్రామ సమీపంలో ఎలా వేస్తారంటూ నిరసన

    • డంపింగ్ యార్డును మరో చోటకు తరలించాలని ఆందోళన

    • చెత్త వాహనాలను అడ్డుకున్న వారిపై బీదర్ అధికారుల బెదిరింపులు

    • మల్గి-బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్త పారబోసిన మున్సిపల్ సిబ్బంది

    • బీదర్-మల్గి మధ్య రాకపోకలు బంద్

  • Jul 01, 2026 10:44 IST

    మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం

    • సింగారం గ్రామ మాజీ సర్పంచ్ యాకయ్య(57) హత్య

    • మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసిన దుండగులు

    • ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jul 01, 2026 10:30 IST

    కామారెడ్డి: మాచారెడ్డి సోసైటీ ఉద్యోగి ADA అపర్ణకు షోకాజ్ నోటీసులు

    • మాచారెడ్డి PACS పరిధిలోని ఎరువుల విక్రయ కేంద్రంలో విచారణ

    • 103 యూరియా సంచులను యాప్‌లో నమోదు చేయని అపర్ణ

    • ఆన్‌లైన్‌లో బుక్ చేసినవారికి కాకుండా ఇతరులకు యూరియా విక్రయించినట్టు గుర్తింపు

  • Jul 01, 2026 10:03 IST

    అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో పోలీసుల తనిఖీలు

    • పెదబయలు రోగులపేట జంక్షన్ వద్ద 165 కేజీల గంజాయి స్వాధీనం

    • అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్

    • ఆటోతో పాటు పైలట్‌గా వచ్చిన ద్విచక్ర వాహనం సీజ్

    • కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

  • Jul 01, 2026 10:01 IST

    అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించిన హోంమంత్రి వంగలపూడి అనిత

    • ఇంటింటికీ వెళ్లి వర్షంలోనూ పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి

    • ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అనిత

    • పరిశుభ్రతపై అధికారులకు కీలక ఆదేశాలు

    • స్థానికులతో మమేకమై మామిడిపండ్లు కొనుగోలు చేసిన మంత్రి

    • టిఫిన్ షాప్‌లో గారెలు రుచి చూసిన మంత్రి అనిత

    • పాయకరావుపేట పీహెచ్‌సీ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి

  • Jul 01, 2026 10:00 IST

    సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిని అభినందించిన సీఎం చంద్రబాబు

    • P4లో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచిన సర్వేపల్లి నియోజకవర్గం

    • CSR నిధులతో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు

    • గిరిజనులకు వేలాది ఆధార్ కార్డులు అందించడంపై సీఎం ప్రశంసలు

    • సర్వేపల్లి అభివృద్ధిని ఇతర నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచన

  • Jul 01, 2026 09:57 IST

    మల్కాజిగిరి కమిషనరేట్‌లో హైటెక్ డ్రోన్ పోలీసింగ్

    • సరూర్‌నగర్ చెరువు పరిసరాల్లో డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా

    • గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ గస్తీ

    • డ్రోన్ ఫుటేజీతో పోలీసు బృందాలకు వెంటనే అలర్ట్

    • గంజాయి సేవిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • డ్రోన్ నిఘాను మరింత విస్తరించనున్న మల్కాజిగిరి పోలీసులు

  • Jul 01, 2026 09:57 IST

    గుంటూరు జిల్లా తుళ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

    • సీడ్ యాక్సిస్ రోడ్డుపై టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jul 01, 2026 09:55 IST

    భారత్‌కు పాక్ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో హెచ్చరికలు

    • పాక్ సంగతి తెలియదంటూ బెదిరింపులు

    • సింధూ జలాలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి

    • పాక్ తమ జలాలను కాపాడుకుంటుంది: భిలావల్

  • Jul 01, 2026 09:54 IST

    హైదరాబాద్: మణికొండలో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు

    • ఓ ప్రైవేట్ హోటల్‌లో హాష్ ఆయిల్‌తో వ్యక్తి పట్టివేత

    • 9 గ్రాముల హాష్ ఆయిల్‌ సీజ్, నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగింత

    • హాష్‌ ఆయిల్ సరఫరా నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్న పోలీసులు

  • Jul 01, 2026 09:53 IST

    చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

    • షాబాద్ చౌరస్తా వద్ద విద్యార్థిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

    • ప్రమాదంలో 18 ఏళ్ల సాత్విక్ రెడ్డి మృతి

    • మృతుడు మొయినాబాద్ స్వామి నారాయణ గురుకులంలో ఇంటర్ విద్యార్థి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    • సాత్విక్ రెడ్డి మృతితో కందాడ గ్రామంలో విషాదం

  • Jul 01, 2026 09:36 IST

    విజయవాడ: సస్పెండైన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు

    • వీడియో కాన్ఫరెన్స్‌లో న్యాయాధికారి ఎదుట వ్యాఖ్యలు

    • సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారు

    • అకారణంగా నన్ను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు: నాగరాజు

  • Jul 01, 2026 09:18 IST

    చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

    • షాబాద్ చౌరస్తా వద్ద విద్యార్థిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

    • ప్రమాదంలో 18 ఏళ్ల సాత్విక్ రెడ్డి మృతి

    • మృతుడు మొయినాబాద్ స్వామి నారాయణ గురుకులంలో ఇంటర్ విద్యార్థి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    • సాత్విక్ రెడ్డి మృతితో కందాడ గ్రామంలో విషాదం

  • Jul 01, 2026 08:48 IST

    విజయవాడ: రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు

    • హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్ట్

    • సాయికృష్ణ కేసులో అశోక్, నాని నిజాలు చెప్పలేదు: సిట్

    • దర్యాప్తు అధికారి ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు: సిట్

    • ఫోన్లు అడిగితే నాగ్‌పూర్‌లో విక్రయించినట్టు చెప్పారు: సిట్

  • Jul 01, 2026 08:47 IST

    తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్

  • Jul 01, 2026 08:42 IST

    హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

    • ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన MLRIT కాలేజీ బస్సు

    • బస్సు కింద పడి మహిళ అక్కడికక్కడే మృతి

    • భారీగా ట్రాఫిక్ జామ్

  • Jul 01, 2026 07:42 IST

    తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

    • 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

    • నేటి నుంచే అమల్లోకి వచ్చిన తగ్గిన ధరలు

    • ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.2,930

  • Jul 01, 2026 07:41 IST

    నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

    • ఉ.11గంటలకు త్రిసభ్య కమిటీ సమక్షంలో గేట్లు ఎత్తివేత

  • Jul 01, 2026 07:40 IST

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం

    • దౌసాలో ట్రక్కును ఢీకొట్టిన బస్సు

    • మంటలు చెలరేగి ఏడుగురి సజీవదహనం

    • మరో ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • స్వల్పగాయాలతో బయటపడ్డ 22 మంది ప్రయాణికులు

  • Jul 01, 2026 07:39 IST

    హైదరాబాద్‌: నేటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

    • ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో 90 రోజుల ట్రాఫిక్‌ డైవర్షన్‌

    • DLF గేట్‌-1 నుంచి రోడ్డు మూసివేత

    • ఫ్లైఓవర్‌ పనులతో గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ మళ్లింపు

    • ట్రిపుల్‌ ఐటీ పరిసరాల్లో ట్రాఫిక్‌ పెరిగే అవకాశం

    • ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని సూచన

  • Jul 01, 2026 07:38 IST

    కరీంనగర్‌: ఆర్టీసీ బస్టాండ్‌లో ఈవీ బస్సులో మంటలు

    • బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

    • 15 రోజుల కిందట అల్గునూరు దగ్గర తగలబడ్డ బస్సు

    • వరుస ప్రమాదాలతో భయాందోళనలో ప్రయాణికులు

  • Jul 01, 2026 07:38 IST

    హైదరాబాద్‌: ఓఆర్‌ఆర్‌పై కాల్పులు

    • బొంగులూరు గేట్‌ దగ్గర నల్లగొండ పోలీసుల కాల్పులు

    • సినీఫక్కీలో ఎస్కేప్‌ అయ్యేందుకు దొంగ యత్నం

    • ఛేజ్‌ చేసి దొంగ కాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులు

    • వనస్థలిపురం ఆస్పత్రికి నిందితుడి తరలింపు

    • నిందితుడిపై ఏపీ, తెలంగాణలో పలు కేసులు

  • Jul 01, 2026 07:35 IST

    నేడు భారత్‌కు జపాన్‌ ప్రధాని తకైచి

    • మూడు రోజులపాటు భారత్‌లో తకైచి పర్యటన

  • Jul 01, 2026 07:34 IST

    బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

    • పోక్సో కేసులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసిన భగీరథ్‌

  • Jul 01, 2026 07:33 IST

    నేడు అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

    • అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం

    • స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముర్ము

    • పాల్గొననున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మంత్రి లోకేశ్

  • Jul 01, 2026 07:32 IST

    తమిళనాడులో కూటమి ఏర్పాటుకు విజయ్‌ ప్రయత్నాలు

    • టీవీకేకి మద్దతిచ్చే పార్టీలతో నేడు సీఎం విజయ్‌ సమావేశం

  • Jul 01, 2026 07:31 IST

    నేడు భారత్‌, ఇంగ్లండ్‌ తొలి T20

    • రాత్రి 10 గంటలకు ఇంగ్లండ్‌ వేదికగా మ్యాచ్‌