ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల..
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:15 PM
ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (X) వేదికగా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,82,317 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 70.52గా నమోదైంది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 63,546 మంది అభ్యర్థులు అర్హత పొందగా, ఉత్తీర్ణత శాతం 89.59గా ఉంది.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ 9552300009 ద్వారా కూడా తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంజినీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు ముందంజలో నిలవడం గర్వకారణమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. వారి విజయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమని అన్నారు. ఈ క్రమంలోనే ర్యాంకుల ఆధారంగా త్వరలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు విద్యార్థులు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News