Share News

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

ABN , Publish Date - Jul 01 , 2026 | 09:03 PM

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న దంపతులను పాము కాటువేయడంతో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త
Telangana Snake Attack

మెదక్, జులై 1: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న దంపతులను పాము కాటువేయడంతో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. టెక్మాల్ మండలం బోడగట్టు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు సంగమేశ్, ఆయన భార్య కవిత రోజులాగే రాత్రి ఇంట్లో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక విషసర్పం వీరిద్దరినీ కాటువేసింది. పాము కుట్టిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో మార్గమధ్యలోనే కవిత కన్నుమూసింది. ఆసుపత్రికి చేరుకునే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.


మరోవైపు తీవ్ర అస్వస్థతకు గురైన భర్త సంగమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో బోడగట్టు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

Updated Date - Jul 01 , 2026 | 09:11 PM