Share News

kumaram bheem asifabad- సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

ABN , Publish Date - Jul 01 , 2026 | 10:46 PM

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణకు దోహదపడుతుందని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదోద్దీన్‌ తెలిపారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాల నివారణ, దర్యాప్తును వేగవంతం చేయడంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎంతగానో ఉపకరిస్తోందన్నారు.

kumaram bheem asifabad- సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
మాట్లాడుతున్న డీఎస్పీ వహిదోద్దీన్‌

సిర్పూరు(టి), జూలై 1 (ఆంధ్రజ్యోతి): సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణకు దోహదపడుతుందని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదోద్దీన్‌ తెలిపారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాల నివారణ, దర్యాప్తును వేగవంతం చేయడంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎంతగానో ఉపకరిస్తోందన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, గ్రామ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మార్కెట్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. నేరస్థులను త్వరితగతిన గుర్తించేందుకు వీలుంటుందన్నారు. గ్రామాల్లో ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కౌటాల సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సై సాగర్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని డీఎస్పీ ఆశోక్‌ అన్నారు. ఆసిఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతానికి దోహదపడుతుందన్నారు. ప్రధాన వీధులు, రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా కెమెరాలు అమర్చాలని సూచించారు. పోలీసుశాఖ భద్రత చర్యలకు ప్రజలు ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 10:46 PM