kumaram bheem asifabad- ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:47 PM
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కార్యాలయంలో సిబ్బందితో కలిసి ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని చెప్పారు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కార్యాలయంలో సిబ్బందితో కలిసి ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని చెప్పారు. దేవుడు మనిషికి జన్మనిస్తే వైద్యుడు పునర్జనిస్తారని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది డీఎంహెచ్‌వోకు కేక్ తినిపించి వేడుకులు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది శ్యాంలాల్, మహలక్ష్మి, సంతోష్, మార్త తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలో బుధవారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అలాగే పోస్టల్ వర్కర్స్ డేను పురష్కరించుకొని ఆసిఫాబాద్ పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంటుగా పని చేస్తున్న రాకేష్‌ను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రమణారెడ్డి, సభ్యులు శంకర్, తారీక్, ప్రకాష్, మహేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): గోలేటిలో లయన్స్ క్లబ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్‌డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ సంగీత, సుప్రియలను ఘనంగా శాలువాలతో సన్మానించారు. అనంతరం రోగులకు పండ్లను పంపిణీ చేశారు. రెబ్బెన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ అధ్యక్షుడు దీకొండ సంజీవ్‌కుమార్, ఉప్పులేటి శంకర్, డైరెక్టర్ మహేందర్, ఉజ్వల్ కుమార్‌లతో పాటు ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.