Share News

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఏఐ సిగ్నల్స్.. సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ సీఈఓ కీలక భేటీ

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:49 PM

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అనలాగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్‌మాన్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఏఐ సిగ్నల్స్.. సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ సీఈఓ కీలక భేటీ
Hyderabad AI Traffic Signals

హైదరాబాద్, జులై 1: నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అనలాగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అలెక్స్ కిప్‌మాన్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనలాగ్, మెగా సంస్థల సంయుక్త ప్రాజెక్టులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్, నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంపై ప్రధానంగా చర్చలు జరిపారు.


నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ ఏఐ (AI) సాంకేతికతతో అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా గ్రీన్ కారిడార్ వ్యవస్థను ఏఐ ద్వారా నియంత్రించే విధానంపై కూడా చర్చించారు. ట్రాఫిక్‌తో పాటూ నగరంలో సెన్సర్లు, రోబోటిక్స్ సాయంతో స్మార్ట్ సిటీ సేవలను విస్తరించాలని ఈ భేటీలో ప్రతిపాదనలు వచ్చాయి. నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్న తాగునీటి లీకేజీలను గుర్తించడం, అలాగే విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వంటి వాటికి కూడా ఏఐ ఆధారిత పరిష్కారాలను వాడుకోనున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అనలాగ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థల మధ్య అధికారికంగా అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరం మరింత ఆధునిక హంగులను సంతరించుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

విరిగిపడిన కొండచరియ.. తృటిలో తప్పించుకున్న బైకర్

ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..

Updated Date - Jul 01 , 2026 | 08:30 PM