kumaram bheem asifabad-రుణాల రికవరీలో పురోగతి సాధించాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:41 PM
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు అందించిన రుణాలను తిరిగి వసూలు చేయడంలో పురోగతి సాధించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల రికవరీపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యులకు స్త్రీనిధి పథకం కింద రూ. 18 కోట్ల రుణాలను అందించామని చెప్పారు.
ఆసిఫాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు అందించిన రుణాలను తిరిగి వసూలు చేయడంలో పురోగతి సాధించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల రికవరీపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యులకు స్త్రీనిధి పథకం కింద రూ. 18 కోట్ల రుణాలను అందించామని చెప్పారు. నిబంధనల ప్రకారం రుణాలను తిరిగి వసూలు చేయలని తెలిపారు. బకాయిలు ఉన్న గ్రూపులను గుర్తించి వారితో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 443 గ్రామసమాఖ్య సంఘాలు ఉన్నాయని వివరించారు. 10,392 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించని సంఘాల నుంచి రికవరీ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. బకాయిలును ఒకేసారి కాకుండా నెలవారీగా వసూలు చేయాలని తెలిపారు. అర్హత కలిగిన సంఘాలకు రుణ సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామానికి చెందిన పోశక్క, నారయణలు గ్రామ సమాఖ్య భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో వారిని శాలువాతో సత్కరించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, మెప్మా పీడీ మోతిరాం, డీపీఎం, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
శుద్ధం జలం అందించేందుకు చర్యలు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సదుపాయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల కొరకు శుద్ధం జలం అందించేందుకు చర్యలు తీసుకుం టున్నామని కలెక్టర్ హరిత అన్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనకాపూర్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పనులతో పాటు ప్రజావాణి కార్యక్రమంలో వినతులు అందించేందుకు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చెందుకు శుద్ధమైన తాగునీ టిని అందించేల ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.2 లక్షల వ్యయంతో ఎస్‌బీఐ జనకాపూర్‌శాఖ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియా డారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వ ర్‌జోషి, డీఆర్‌డీవో దత్తారావు, బ్రాంచి మేనేజరు జీవన్‌కుమార్, ఏవో కిరణ్ పాల్గొన్నారు.