kumaram bheem asifabad-సర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:44 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు
ఆసిఫాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను సరైన సమాచారంతో నింపి తిరిగి ఫారాలను బూత్‌స్థాయి అధికారులకు అందించే విధంగా రాజకీయ పార్టీలు దృష్టి సారించా లన్నారు. ఇప్పటి వరకు 94 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని 11,310 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా 23 రోజుల గడువు మిగిలి ఉందని ఫారాలపై కలర్ ఫొటో అతికించి మొబైల్ నంబరు తప్పని సరిగా రాసీ నింపిన ఫారాలను బీఎల్‌వోలకు అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహొత్సవం-2026లో భాగంగా నిర్థేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో వనమహోత్సవ లక్ష్యాల సాధనపై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 46.78 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్థేశించడం జరిగిందని శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సాదించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్‌వో బాలామణి, డీఆర్వో వేణు, డీఆర్‌డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని అగర్‌వాడ గ్రామంలో సర్పంచ్ రోజా సోనాజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్, టెక్స్ట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయలన్నారు. అన్ని పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు అల్పహరం పోషకాలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనం ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను ఉచితంగా అంది స్తుందని తెలిపారు. ప్రాథమిక విద్యభ్యాసం పూర్తయిన తర్వాత పై చదువులకు గురుకులాలకు పంపించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి పాఠశాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గ్రామంలో అంతర్గత రహదారులు, మురికి కాలువల నిర్మాణం, నూతన రేషన్ షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా మని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రకాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.