Home » Telangana Police
డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వరంగల్ పర్యటనకు వెళ్తుండగా భువనగిరి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో హరియాణా పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో దోపిడీ కేసుకు సంబంధించిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.
వరంగల్ నగరంలోని ప్రముఖ భద్రకాళీ ఆలయం వద్ద ఈరోజు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయంలో స్నానాలు చేయడం వల్ల ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ, ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు పోలీసు అధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను ఉపసంహరించుకుంది.
హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్‌ఆర్‌పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగులూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది.