Home » Telangana Chief Minister
రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు.
తెలంగాణలో పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర విద్యా కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పదో తరగతి పరీక్షలు లేనట్లేనన్నారు. దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమది వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం ప్రభుత్వ కార్యక్రమాల జాబితా కాకుండా, భవిష్యత్తు తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్‌గా నిలిచిందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ కోసం తెలంగాణ క్రీడాకారులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.