Home » Telangana BJP
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల భూములను 22 ఏలో పెట్టలేదని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు.
నర్సాపూర్‌లో 22A నిషేధిత భూముల జాబితాని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
22A భూములపై అసెంబ్లీలో చర్చిద్దామని.. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. 22A అడ్డుపెట్టుకుని దందాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో, అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర శాఖ పోరాటాలు ప్రశంసనీయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. ‘సడక్ సే సదన్ తక్’ అంటూ కాంగ్రె్‌సపై పోరాటాలను కొనసాగించాలని సూచించారు.
రైతు ఏడిస్తే రాజ్యాలు కూలిపోతాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై లాఠీచార్జి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు ఘటనలను నిరసిస్తూ.. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.
హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
అమెరికా పర్యటనలో భారత్ వ్యతిరేక శక్తులతో భేటీ కానున్నట్లు అందిన సమాచారం వల్లే సీఎం రేవంత్‌రెడ్డికి అగ్రరాజ్య పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు.