Ramachandra Rao: క్రిస్టియన్ సమాజం హింసను ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది: రాంచందర్‌రావు
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:34 PM
గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. భారత్‌లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ , డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ శాంతి కోసం అన్ని మతాలు కలిసి కృషి చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు (Ramachandra Rao) వ్యాఖ్యానించారు. హింసను ఎప్పుడూ ప్రోత్సహించకూడదని సూచించారు. క్రిస్టియన్ సమాజం హింసను ఎప్పుడూ వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) అమీర్‌పేటలోని ఆదిత్య పార్క్ హోటల్‌లో బండారు దత్తాత్రేయ, మర్రి శశిధర్ రెడ్డి, భగవంత్ రావుతో కలిసి అల్కా మనోజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొని మాట్లాడారు రాంచందర్‌రావు.
క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేసిన అల్కా మనోజ్, వారి టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో బేత్లెహెమ్, జెరూసలెం వంటి క్రిస్టియన్ సంబంధిత స్థలాలను సందర్శించడం ద్వారా, క్రిస్టియన్ ధర్మంలో శాంతి, ప్రేమ భావనను పొందవచ్చని తెలిపారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ, క్రిస్టియన్ సమాజంపై కొంతమంది దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాంచందర్‌రావు.
ఉదాహరణకు, సిరియాలో క్రిస్టియన్ల సంఖ్య 20 లక్షల నుంచి కేవలం 3 లక్షలకు తగ్గిందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ భావన ప్రకారం.. క్రిస్టియన్ సమాజం కూడా అభివృద్ధి మార్గంలో నడుస్తోందని తెలిపారు. గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని చెప్పుకొచ్చారు. భారత్‌లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
మహిళలపై వ్యాఖ్యలు... శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు
For More TG News And Telugu News