Share News

Film Actor Sivaji: మహిళలపై వ్యాఖ్యలు... శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:22 PM

ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.

 Film Actor Sivaji: మహిళలపై వ్యాఖ్యలు... శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు
Film Actor Sivaji

హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ (Film Actor Sivaji) మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న(సోమవారం) హైదరాబాద్‌లో జరిగిన దండోరా సినిమా ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణను ఉద్దేశించి శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.


ఈ క్రమంలోనే శివాజీకి నోటీసులను ఇవాళ(మంగళవారం) జారీ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద. శివాజీ మాట్లాడిన మాటలను మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని తెలిపారు. ఆయన మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. నటులు సినీ వేడుకల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు నేరెళ్ల శారద.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ

For More TG News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 05:57 PM