Home » Team India
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ప్రొటీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 189 పరుగులకే భారత్ ఆలౌటైంది.
సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మైదానం వీడాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బవుమాపై టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా సౌతాఫ్రికా కోచ్ స్పందించారు
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్, దేవుడి దయతో మళ్లీ జట్టులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో అతడు 4వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశముంది. కేఎల్ ఇప్పటివరకు 65 టెస్టుల్లో 3,985 పరుగులు సాధించాడు.
ఐసీసీ అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన అవార్డులను విడుదల చేసింది. దీంట్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును దక్కించుకుంది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది.
ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ శత్రువుగా చమత్కరించాడు.
టీమిండియాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో భారత్‌ను ఓడించడం కష్టమేనని.. కానీ మేం ఈసారి సిరీస్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టాస్ ఓడిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లాహిరు సమరకూన్(14 బంతుల్లో 52), కెప్టెన్ మధుశంక(15 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. అనంతరం 139 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.