Share News

భారత్-న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

ABN , Publish Date - Jan 31 , 2026 | 06:55 PM

తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

భారత్-న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
India New Zealand

ఇంటర్నెట్ డెస్క్: తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఐదో టీ20లో విజయం సాధించి.. అదే ఆత్మవిశ్వాసంతో రానున్న ప్రపంచ కప్‌ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.


కాగా ఈ మ్యాచుకు సంబంధించి తుది జట్టులో ఇషాన్ కిషన్ తిరిగి బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాకు రెస్ట్ ఇచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.


భారత తుది జట్టు ఇదే..

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా


న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..

టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకోబ్స్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జెమీసన్, సోధీ, లాకీ ఫెర్గూస్, డఫీ


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Jan 31 , 2026 | 07:49 PM