Share News

ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. మహిళల విజేతగా రిబకినా

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:18 PM

ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా ఎలెనా రిబకినా నిలిచింది. అద్భుతమైన పోరాటంతో ఈ టోర్నీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా విజయం సాధించింది.

ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. మహిళల విజేతగా రిబకినా
Elena Rybakina

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్‌కు చెందిన ఎలెనా రిబకినా నిలిచింది. అద్భుతమైన పోరాటంతో ఈ టోర్నీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా(Elena Rybakina) విజయం సాధించింది. 2023 ఫైనల్‌లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు. అయితే అప్పుడు సబలెంకా విజయం సాధించింది.


మ్యాచ్(Australian Open 2026) తొలి గేమ్‌లోనే సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబకినా.. తొలి సెట్‌ను 6-4తో తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండో సెట్‌లో సబలెంకా(Sabalenka) జోరు చూపుతూ అదే స్కోర్‌తో సెట్‌ను దక్కించుకుని పోరును సమం చేసింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సబలెంకా.. విజయానికి చేరువైనట్టే కనిపించింది. కానీ అక్కడి నుంచి రిబకినా అసాధారణమైన పట్టుదల కనబరిచింది. వరుసగా రెండు సార్లు సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. చివరకు మూడో సెట్‌ను 6-4తో ముగించి ఛాంపియన్‌గా అవతరించింది. అయితే ఇది రిబకినాకు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కాగా.. కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ కిరీటం. మరోవైపు సబలెంకాకు వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో నిరాశే ఎదురైంది.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Jan 31 , 2026 | 05:18 PM