Share News

యాభై వికెట్ల క్లబ్‌లో అర్జున్ టెండూల్కర్

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:04 PM

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ యాభై వికెట్ల క్లబ్‌లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున అతడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

యాభై వికెట్ల క్లబ్‌లో అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ యాభై వికెట్ల క్లబ్‌లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున అతడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2022-2023 సీజన్‌లో అతడు గోవా తరఫున తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. రాజస్థాన్‌పై ఆ మ్యాచులోనే సెంచరీ కూడా బాదాడు. అటు బౌలింగ్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.


అయితే అర్జున్(Arjun Tendulkar) 50 వికెట్లలో 13 వికెట్లను ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లోనే సాధించడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నప్పటికీ.. తన తండ్రి సచిన్ కన్నా 21 వికెట్ల వెనుకంజలోనే ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సచిన్ 71 వికెట్లు సాధించాడు. దేశవాళీల్లో తొలుత ముంబై తరఫున ఆడిన అర్జున్.. తర్వాత గోవాకు మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆల్‌రౌండర్‌గా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో ఇంతకు ముందు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అర్జున్.. ఈ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా వెళ్లాడు.


ఇదిలా ఉండగా.. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ బ్యాట్‌తోనే కాకుండా, బంతితోనూ తనదైన ముద్ర వేశాడు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ ఫార్మాట్లో 46, వన్డేల్లో 154 వికెట్ల తీసిన ఘనత సచిన్‌ది. ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌ ఆడిన సచిన్‌.. పొట్టి ఫార్మాట్‌లోనూ ఒక వికెట్‌ను తీసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Jan 31 , 2026 | 05:04 PM