Home » Team India
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసు లక్ష్యంగా భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రేసులో టీమిండియా కాస్త వెనుకబడి ఉంది. ఇదే విషయంపై భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన మార్క్‌ను చూపించాడు. విభిన్నమైన షాట్లతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన తనయుడు తండ్రిని తలపించేలా బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. సెంచరీ సెలబ్రేషన్‌లో కండల ప్రదర్శన చేయడంపై ధ్రువ్ జురెల్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా ఇబ్రహీంకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.
కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. 503/9 స్కోర్ వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో కొనసాగించాలని గంభీర్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక పడిక్కల్‌ను భవిష్యత్తులో పక్కన పెట్టలేరని తెలిపాడు.
శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోతో జరిగిన వివాదం విషయంలో యశస్వి జైస్వాల్ పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బ్లోగే కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలకు జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. అయితే అతడి గైర్హాజరీపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు.