Share News

భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా.. వెదర్ రిపోర్ట్ ఇదే!

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:05 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చే ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.

భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా.. వెదర్ రిపోర్ట్ ఇదే!
IND vs ZIM weather report

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భారత్, జింబాబ్వే మ్యాచ్ ఒకటి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చేందు ఈ మ్యాచ్ టీమిండియా చాలా కీలకం. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే చెన్నైలో వాతావరణం ఎలా ఉంది, వర్షం ముప్పు ఏమైనా ఉందా?. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...


కొద్దిరోజులుగా తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కు వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందా? అన్న ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే చెన్నైలో గురువారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు కురిసింది. ఆ తర్వాత పాక్షికంగా మేఘాలు కమ్ముకున్నాయి. వీటి కారణంగా వర్షాలను కురిపించే అవకాశాలు లేవని, కేవలం వాతావరణం చల్లగా ఉంటుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఇక మ్యాచ్(India vs Zimbabwe) ప్రారంభమయ్యే సమయానికి చెన్నైలో మేఘాలతో కూడిన ఆహ్లాదకర వాతావరణమే ఉంటుందని వెల్లడించారు.


మొత్తంగా చెన్నై వాతావరణ కేంద్రం అంచనాలను ప్రకారం భారత్, జింబాబ్వే మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని అర్థమవుతోంది. మేఘాల కారణంగా వెలుతురు సమస్య ఉండవచ్చు, కానీ, రాత్రి ప్లడ్ లైట్ల వెలుగులోనే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ సమస్య ఉండదని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇవాళ మ్యాచ్‌లో టీమిండియాకు భారీ విజయం అనివార్యమైంది.


ఇవి కూడా చదవండి:

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 26 , 2026 | 02:44 PM