Share News

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: జింబాబ్వేతో కీలక పోరు.. టీమిండియా ఘన విజయం

ABN , Publish Date - Feb 26 , 2026 | 10:47 PM

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ ఓటమితో జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: జింబాబ్వేతో కీలక పోరు.. టీమిండియా ఘన విజయం
T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ ఓటమితో జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్నెట్(97*) అద్భుతంగా రాణించాడు.


కెప్టెన్ సికందర్ రజా(31), మారుమని(20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే తలొక వికెట్ పడగొట్టారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(55) ఎట్టకేలకు ఫామ్ అందుకుని హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్య(50*) అర్ధ శతకంలో అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మ(44*; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రప్ఫాడించాడు. ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజు శాంసన్(24) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో ఎంగర్వ, ముజరబాని, మపోసా, సికందర్ రజా తలొక వికెట్ తీసుకున్నారు. కాగా టీమిండియా మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.


ఇవి కూడా చదవండి:

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 26 , 2026 | 10:47 PM