Home » TDP
ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యమని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, రెన్యువబుల్ ఎనర్జీ అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వైసీపీ విషప్రచారం చేస్తోందంటూ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వర రావు.. పలువురు టీడీపీ నేతలతో కలిసి గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం ఎన్నడూ జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ కుప్పంలో సోమవారం టీడీపీ ఆఽధ్వర్యంలో సాగిన విజయోత్సవ ర్యాలీ సాగింది.
డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.
డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జిలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.