Tenali Tension: ఎమ్మెల్సీ ఫ్లెక్సీల తొలగింపు.. ఉద్రిక్తం
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:22 PM
తెనాలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీలను తొలగించడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
గుంటూరు, జనవరి 6: జిల్లాలోని తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా (MLC Alapati Raja) ఫ్లెక్సీల తొలగింపుపై రగడ చోటు చేసుకుంది. ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నాయకులు (TDP Leaders), మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఫ్లెక్సీల తొలగింపుపై మున్సిపల్ అధికారులతో తెలుగు దేశం నేతలు ఘర్షణకు దిగారు. దీంతో తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాహబ్ చౌక్ వద్ద డివైడర్ మధ్యలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నాయకులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగు దేశం నేతల ఆందోళనతో అక్కడకు వచ్చిన మున్సిపల్ సిబ్బందితో వారు వాగ్విదానికి దిగారు. ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ వారిని నిలదీశారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది, తెలుగు దేశం నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతల ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి...
ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
పరకామణి కేసులో పోలీసులకు హైకోర్టు షాక్
Read Latest AP News And Telugu News