Home » TDP
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి లక్షలమంది అర్హులకు పెన్షన్ తొలగించిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదైందంటేనే చర్చలు మొదలయ్యాయి. కానీ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి, పార్టీ నాయకుడైనా ఉపేక్షించవద్దని ఆదేశించడం రాజకీయాల్లో మార్పుగా నిలిచింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి సానుకూల సంకేతమా? వివాదాలకు తెరలేపే అంశమా అనే చర్చ సాగుతోంది.
తిరుపతి-తిరుమల నడుమ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు చేసిన ప్రకటన మహిళా యాత్రికులను మహదానందానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉచితంగానే తిరుపతికి చేరుకున్నా తిరుమలకు మాత్రం చార్జీలు చెల్లించాల్సిరావడం వీరిని అసంతృప్తికి గురిచేసింది. తాజా నిర్ణయం అమలు తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి తిరుమలకు ఉచితం చేయడం వల్ల ఆర్టీసీ మీద పడే భారం కూడా ఏమంత ఎక్కువ కాదు.
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.
కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తనపై చేసిన లైంగిక ఆరోపణను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇకనుంచి జీరో ఫేర్ టికెట్‌తో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు...
జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీకి ఓటరు దిమ్మతిరిగే తీర్పునిచ్చాడు. జగన్ అడ్డా..
ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తనకు ఉన్నాయని, తాటాకు చప్పుళ్లకు భయపడనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సాయినగర్‌లోని ఆసుపత్రి సమస్యపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నానని, ఆ వివరాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలుస్తానని స్పష్టం చేశారు.