Share News

Minister Ponguru Narayana: అక్రమ కట్టడాలు, లేఔట్‌లు నిర్మిస్తే కూల్చివేస్తాం..

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:36 PM

గూడూరుకు రూ.73 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.

Minister Ponguru Narayana: అక్రమ కట్టడాలు, లేఔట్‌లు నిర్మిస్తే కూల్చివేస్తాం..
Minister Narayana

నెల్లూరు: గూడూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా రూ.10వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు.


ఈ పథకం ద్వారా గూడూరుకు రూ.73 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్టంలో ఉన్న పనికిరాని డ్రైనేజీలను పూడ్చడానికి రూ.28 వేల కోట్ల ఖర్చు అవుతుందని వివరించారు. మొదటి విడతగా రూ.4 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, లేఔట్‌లు నిర్మిస్తే కూల్చివేస్తామని మంత్రి నారాయణ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 05 , 2025 | 05:04 PM