రాష్ట్రాభివృద్ధికి సీఎం కృషి
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:39 AM
సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. నేలకోసిగి గ్రామంలో ఇంటింటికి తిరిగి వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు.
కోసిగి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. నేలకోసిగి గ్రామంలో ఇంటింటికి తిరిగి వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి, వీఆర్వో బసవరాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, టీడీపీ మండల అద్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వందగల్లులో ఏవో ఎం.వర ప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పైన రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. వందగల్లు గ్రామంలో నిర్మిస్తున్న పాఠశాలకు నిర్మాణంలో ఆగిపోయిన తరగతి గదులను, పాఠశాలకు రోడ్డు సమస్య గురించి ప్రజలు తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. నాయకులు నాడిగేని అయ్యన్న, చింతలగేని నర్సారెడ్డి, రామకృష్ణ, చిన్నతాయన్న, వీరారెడ్డి, శంకర్, పంపాపతి, నరసింహులు, చిన్నారెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.