CM Chandrababu Naidu: పీ-4తో అభివృద్ధిలో టాప్ ప్లేస్‌కి ఏపీ..

ABN, Publish Date - Sep 30 , 2025 | 08:12 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రాడెక్టు పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నామని వివరించారు. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పుడు ఓ నినాదమన్నారు. పీ-4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated at - Sep 30 , 2025 | 08:13 PM