Ibrahimpatnam Liquor Scam: నకిలీ మద్యం వ్యవహారంలో కొత్త కోణం.. వీడియో విడుదల..
ABN , Publish Date - Oct 06 , 2025 | 08:56 PM
ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడిన విషయం తెలిసిందే. బయటపడిన నకిలీ మద్యానికి సంబంధించిన మూలాలు అన్నమయ్య జిల్లా మెులకలచెరువులో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నకిలీ మద్యం వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ మేరకు కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం అంశాలను తాను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు జనార్దన్ వీడియోలో తెలిపారు. నకిలీ మద్యం కేసులో తన పేరు ఏ-1గా చేర్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసుతో తంబళ్లపల్లె టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు జనార్దన్. స్వలాభం కోసమే ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అనారోగ్య కారణాలతో తాను విదేశాల్లో చికిత్సపొందుతున్నట్లు జనార్దన్ చెప్పుకొచ్చారు.
ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడిన విషయం తెలిసిందే. బయటపడిన నకిలీ మద్యానికి సంబంధించిన మూలాలు అన్నమయ్య జిల్లా మెులకలచెరువులో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, కేసులో ఏ-వన్‌గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌కి సంబంధించిన గోడౌన్‌లో మద్యం బయటపడింది. గోడౌన్‌లో పెద్దఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్పిరిట్, అదే విధంగా ఖాళీ బాటిళ్లను అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. నకిలీ మద్యం తయారీలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకుల పాత్ర ఉందన్న సమాచారంతో అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. నియోజకవర్గ పరిశీలకుల ద్వారా పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు నకలీ మద్యం కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు