Share News

CM Chandrababu Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చ

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:14 PM

కూటమి అభ్యర్థి విజయానికి నేతలు కృషి చేయాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. నారావారిపల్లి నుంచి చంద్రబాబు వచ్చిన వెంటనే తెలంగాణ నేతలతో ఉండవల్లి నివాసంలో సమావేశంకానున్నారు.

CM Chandrababu Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చ
CM Chandrababu Jubilee Hills Bypoll

తిరుపతి, అక్టోబర్ 7: తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) సాయంత్రం 7 గంటలకు సమావేశంకానున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పట్ల అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కూటమి అభ్యర్థి విజయానికి నేతలు కృషి చేయాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. నారావారిపల్లె నుంచి చంద్రబాబు వచ్చిన వెంటనే తెలంగాణ నేతలతో ఉండవల్లి నివాసంలో సమావేశంకానున్నారు.


కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు నారా రామూర్తి నాయుడు మరణించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నారావారిపల్లెలో సంవత్సరీకం, స్మృతి వనం ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నారావారిపల్లె సమీపంలోని రంగపేట హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి నారావారిపల్లెలోని ఇంటికి చేరుకున్నారు. నారా రామూర్తినాయుడు సంవత్సరీకం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఆపై మధ్యాహ్నం రంగంపేట వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి తిరుగు ప్రయాణం అయి.. ఉండవల్లిలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నారావారిపల్లెలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు... భూమనకు మంత్రి మండిపల్లి వార్నింగ్

ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 02:31 PM