Home » TDP
గత వైసీపీ పాలనలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కూటమి పాలనలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు.
సీఎం చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంగళవారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో రొళ్ల మండలం అవినకుంట, జీజీహట్టి, దొడ్డేరి గ్రామాలకు చెందిన 20 కుంటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని 25వ వార్డులో తెలుగుమహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించా రు. 25వ వార్డులోని ప్రియాంక నగర్, హమాలీకాలనీ, లక్ష్మీచెన్నకేశ వపురం ప్రాంతాలలో సోమవారం టీడీపీ వార్డు ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో తెలుగుమహిళలు విజయలక్ష్మి, పుష్పలత, సుజాత, రాజేశ్వరి, రక్షిత, సుశీల, నాగమణి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సీఎం బహిరంగ సభకు తరలిరాలని కోరారు.
అనంతపురంలో ఈనెల 10న జరగనున్న సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ సభకు మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, అమ లాపురం ఎమ్మెల్యే ఆనందరావు పిలుపు నిచ్చారు. పట్టణ సమీపంలోని చిగిచెర్ల రోడ్డులో ఉన్న పద్మావతి కల్యాణమండపంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఎన్డీఏలో టీడీపీ చేరిందని, ఈ మేరకు కూటమికి నిబద్ధతతో మద్దతు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ అభ్యర్థిని తాము సపోర్ట్ చేస్తామని అన్నారు.
కూటమి సర్కార్‌పై వైసీపీ మరో కొత్త దుష్పచారాన్ని మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్రంలో వైసీపీ విష ప్రచారం చేస్తుంది.
గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు.
‘అనంతపురం అర్బన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లండి.. ఆడపడుచులకు బొట్టుపెట్టి, సూపర్‌హిట్ సభకు ఆహ్వానించండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచే లక్ష మంది కదిలి రావాలి’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు సూచించారు.