Share News

Kalyandurg News: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్‌పై వేటు..

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:15 AM

ఛైర్మన్ పదవి నుంచి తలారి రాజ్ కుమార్‌ను తొలగిస్తూ.. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజ్ కుమార్ కౌన్సిల్ సమావేశాలు సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

Kalyandurg  News: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్‌పై వేటు..
Talari Raj Kumar

అనంతపురం: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి వైసీపీ నేత తలారీ రాజ్ కుమార్‌‌ను తొలగించింది. అధికార దుర్వినియోగం చేసినందుకు వేటు వేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంలో తీవ్రనిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. గతంలో షోకాజ్ నోటీసులు పంపినా రాజ్ కుమార్ స్పందించక పోవడంతో.. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


ఈ మేరకు ఛైర్మన్ పదవి నుంచి తలారి రాజ్ కుమార్‌ను తొలగిస్తూ.. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఛైర్మన్ పదవిలో ఉన్న ఆయన కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదని, ఫోన్లకు స్పందించడం లేదని కౌన్సిలర్లు వాపోతున్నారు. దీంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ప్రభుత్వం తలారి రాజ్ కుమార్‌ను ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు

Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు

Updated Date - Oct 30 , 2025 | 11:16 AM