Share News

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

ABN , Publish Date - Oct 21 , 2025 | 07:07 AM

సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్‌, అబుదాబి, UAEలో పర్యటించనున్నారు.

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

అమరావతి, అక్టోబర్ 21: సీఎం చంద్రబాబు (CM Chandrababu) మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్‌ (Dubai), అబుదాబి, UAEలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో (Vishakhapatnam) జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్ (Real Estate), భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌తోపాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడుదారులను ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

ఇప్పటికే పలు విదేశీ పర్యటనలు..

ఏపీ రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతితో పాటు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే సింగపూర్, దావోస్‌లో సైతం ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రి లోకేష్ (Lokesh) సైతం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కంచుకోటగా ఉండబోతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ముహూరత్ ట్రేడింగ్ ఏ రోజు, ఎప్పుడు.. పూర్తి వివరాలు మీ కోసం..


దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 21 , 2025 | 07:14 AM