MLA Ramesh Babu: వైసీపీ నాయకులు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసు..
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:17 PM
మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశాను తన క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రమేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. పరవాడలో జరిగిన కల్తీ మద్యం డంపింగ్ గుర్తించిన వెంటనే.. మీడియా సమక్షంలో ఎక్సైజ్ అధికారులకు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశాల ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
విశాఖ: మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు. అదీప్ రాజ్ నిన్ననే నిద్రలోంచి లేచినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకులు ఎంత దోచుకున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మద్యం కుంభకోణం ఎవరు తనతో చేయించారో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చెప్పకనే చెప్పాడని పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది అదీప్ రాజ్ వ్యవహారమని చెప్పుకొచ్చారు. అదీప్ రాజ్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఖండించారు.
తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశాను తన క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రమేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. పరవాడలో జరిగిన కల్తీ మద్యం డంపింగ్ గుర్తించిన వెంటనే.. మీడియా సమక్షంలో ఎక్సైజ్ అధికారులకు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశాల ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాజకీయాలలో అధికారపక్షంగా ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడే తత్వం తనది కాదని, తనకంటూ.. ఒక చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి