AP Government Gifts To People: వెలుగుల చంద్రుడు!
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:21 AM
దీపావళి.. చెడుపై విజయానికి సూచిక.. చీకట్లు తొలగించి వెలుగులు అందించే పండగ.. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో చీకట్లు కమ్ముకున్నాయి.. కూటమి ప్రభుత్వంలో ఎన్నో కొత్త వెలుగులు వచ్చా యి. పింఛన్ల పెంపు నుంచి ఉచిత గ్యాస్, ఫ్రీబస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవ లో, విద్యుత బిల్లుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజల జేబుల్లో కాసులు గలగలలాడుతున్నాయి. అటు కొత్తరేషన కార్డులు, పాస్ పుస్తకాల జారీ. గుంతల్లేని రహదారులు, ఇటు అభివృద్ధి, అటు పె
వెలుగు..జిలుగులే
అరాచకపు చీకట్లు తొలగాయ్
అభివృద్ధి వెలుగులొస్తున్నాయ్
సంక్షేమంతో మంచి రోజులు
సూపర్ సిక్స్ పథకాలతో వెలుగు
పోస్టుల భర్తీతో నిరుద్యోగుల సంతోషం
రేపే దీపావళి
సర్కారు ఏం చేయగలదు?
అధికారంతో ఏదైనా చేయగలదు..
అభివృద్ధి చేయగలదు..
అరాచకమూ సృష్టించగలదు..
గత ఐదేళ్లూ జనం అరాచకం చూశారు..
భరించలేక ఓటుతో తరిమికొట్టారు...
ప్రభుత్వాన్నే మార్చేశారు..
ఇప్పుడేం చూస్తున్నారు?
హామీల అమలు చూస్తున్నారు..
అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారు..
గూగుల్ రాకతో మన గతి
సూపర్ అంటూ ఆనందపడుతున్నారు..
చీకట్లు తరిమికొట్టే చంద్రన్న పాలనలో
ఆనంద దీపావళికి సన్నద్ధమవుతున్నారు..
- (కాకినాడ,ఆంధ్రజ్యోతి)
దీపావళి.. చెడుపై విజయానికి సూచిక.. చీకట్లు తొలగించి వెలుగులు అందించే పండగ.. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో చీకట్లు కమ్ముకున్నాయి.. కూటమి ప్రభుత్వంలో ఎన్నో కొత్త వెలుగులు వచ్చా యి. పింఛన్ల పెంపు నుంచి ఉచిత గ్యాస్, ఫ్రీబస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవ లో, విద్యుత బిల్లుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజల జేబుల్లో కాసులు గలగలలాడుతున్నాయి. అటు కొత్తరేషన కార్డులు, పాస్ పుస్తకాల జారీ. గుంతల్లేని రహదారులు, ఇటు అభివృద్ధి, అటు పెట్టుబడుల వెల్లువతో జిల్లా ముఖచిత్రం మళ్లీ మారుతోంది. మూతపడ్డ అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిపించి రూ.5కే పేదలు కడుపునిండా భోజనం చేసేలా చేస్తోంది. డీఎస్సీ పోస్టుల మొదలు మళ్లీ వచ్చే ఏడాది ఇంకో డీఎస్సీ, అటు పోలీస్, అటవీశాఖల్లో పోస్టుల భర్తీతో నిరుద్యోగుల మోము మతాబుల్లా వెలుగుతోంది.
రోడ్లు వేశారు.. నరకం తప్పించారు!
వైసీపీ పాలనలో ప్రజలు రహదారులపై నరకం చూశారు. ప్రభుత్వం మారగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో 900 కిలోమీటర్ల మేర అధికారులు 350కిపైగా రోడ్లను గుర్తించి రూ.70.76 కోట్లు వెచ్చించి గుంతలు పూడ్చారు. కాకి నాడ- జొన్నాడ రహదారి రూ.225 కోట్లు, కాకినాడ -రాజమండ్రి కెనాల్ రోడ్డు రూ.160 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారు.
పరిశ్రమలు వస్తున్నాయ్..
సీఎం చంద్రబాబు కృష్టితో అనేక కంపెనీలు, పర్యాటక ప్రాజెక్టులు తరలివస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన కో కంపెనీ కాకినాడలో రూ.13 వేల కోట్లతో గ్రీన అమ్మోనియా ప్లాంట్, రూ.2,800 కోట్లతో కొత్తగా ఎలకో్ట్రలైజర్ల తయారీ ప్లాంట్‌కు ఏర్పాటు చేయనుంది. కోనసీమ, కాకినాడలో రూ.300 కోట్లు పర్యాటక పెట్టుబడులు పెట్టనున్నారు.
నాడు మైక్రోసాఫ్ట్.. నేడు గూగుల్
నేడు హైదరాబాద్ ఇలా ఉందంటే దానికి కారణం చంద్రబాబు.. ఎందుకంటే నాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను రప్పించారు.. నేడు విశాఖకు గూగుల్ రప్పిస్తున్నారు. దీంతో నిరుద్యోగుల కష్టాలు తీరనున్నాయి. కొత్త వెలుగులు రానున్నాయి.. తూర్పుగోదావరి జిల్లాలో టాటా ఇన్నోవేషన హబ్ ఏర్పాటుచేశారు. మీకో బిజినెస్ ఐడియా ఉందా.. అక్కడికి వెళితే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు.
నాడు కష్టాలు.. నేడు వెలుగులు
పింఛన్ల ధమాకా : ప్రభుత్వం మారింది.. ప్రజల దశ మారింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు రూ.3 వేల పింఛన రూ.4 వేలు, అనారోగ్య బాధితులకు రూ.15 వేల చొప్పున పెంచి ఒకటో తేదీనే అందజేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 2,72,107 మందికి రూ.117 కోట్లు, కోనసీమలో 2,36,705 మందికి రూ.101 కోట్లు, తూర్పులో 2,35,502 మందికి రూ.103 కోట్లు అం దుతున్నాయి. ఉద్యోగులకు ఒకటినే జీతాలిస్తున్నారు.
తల్లికి వందనం : ఇచ్చిన హామీ మేరకే ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లివందనం డబ్బులు పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో 5,88,378 మంది విద్యార్థులకుగాను 3, 85,601మంది తల్లులఖాతాల్లో రూ.764 కోట్లు జమైంది.
ఉచిత గ్యాస్ : ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలవుతోంది. ఉమ్మడి జిల్లాలో 13 లక్షలగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఉచిత సిలిండర్ 11.52 లక్షల మంది వినియోగించుకోగా రూ.95 కోట్లు జమచేసింది.
ఉచిత బస్సు: ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయా ణం అమలుచేసింది. ఉమ్మడి జిల్లాలో 25.52 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరుతోంది.
అన్నదాత సుఖీభవ : ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.2 వేలకు, రాష్ట్రప్రభుత్వం రూ.5వేలు కలిపి మొదటి విడతగా రూ.7 వేలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల మందికిపైగా రూ.300 కోట్లకుపైగా జమ చేసింది.
పాస్‌బుక్‌లు : ఐదేళ్లపాటు కొత్త పట్టాదారు పాస్‌బుక్ లు ఇవ్వకుండా గత వైసీపీ తిప్పలు పెట్టింది.ప్రభుత్వం మారాక రాజముద్రతో కాకినాడ జిల్లాకు 1.47 లక్షలు, కోనసీమ 1.02 లక్షలు, తూ.గో. 95 వేలు జారీ చేశారు.
డీఎస్సీ సక్సెస్ : గత ఐదేళ్లపాటు ఆచూకీ లేని డీఎస్సీ పోస్టులను భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,241 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువులు దక్కాయి. వచ్చే ఏ డాది మరో డీఎస్సీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఉద్యోగులకు డీఏ: దీపావళి కానుకగా ప్రభుత్వం ఉద్యోగులకు శనివారం ఒక డీఏ ప్రకటించింది. పోలీసులకు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఈఎల్ ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులకు ఎర్న్‌లీవ్ ఇన్‌స్టాల్‌మెంట్‌తోపాటు దీపావళికే పదోన్నతులు ఇస్తామని ప్రకటించింది.
జీఎస్టీ పండుగ: ఇక కేంద్రం జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలు లాభపడ్డారు. నిజమైన దీపావళి ఇది.