Home » TDP - Janasena
మాజీ సీఎం జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్‌ను రాజ్‌నాథ్ కోరారు.
సీపీ రాధాకృష్ణన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
నిందితుడి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని తన వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్‌పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు గంజాయి కేసులు నమోదు అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడంతో మహిళలకు నిజమైన పండుగ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించడంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఆర్థిక శాఖ మంత్రి జెండా ఊపి, పథకాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్టీసీ అధికారులు పథకాన్ని ...
మహిళలు ఎదురుచూసిన వేళ రానే వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 5 గంటల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు అనంత ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతించనున్నారు. ఆ మేరకు మహిళలు ...
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.
ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు
ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..
కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల (AMC) ఛైర్మన్ పదవులను ఖరారు చేసింది.