Share News

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:03 PM

ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ
Ramakrishna

కర్నూలు: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అమ్ముడుపోయిందని విమర్శించారు. ఈనెల 23,24,25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.


ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక్కరిదే ఈ సమస్య కాదని ప్రతి ఒక్కరూ.. దొంగ ఓట్లపై స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


దొంగ ఓట్ల వ్యవహరంలో మోదీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రామకృష్ణా వెల్లడించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదని స్పష్టం చేశారు. కానీ బీజేపీ కొత్త రాజ్యాంగం రాసుకుంటామని అంటోందని పేర్కొన్నారు. దేశంలోనే సీనియర్ నేత అని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. మోదీని చూసి రాష్ట్రంలో ఉన్న పార్టీలు భయపడుతున్నాయని ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

Updated Date - Aug 09 , 2025 | 04:03 PM