Sree Shakti : మహిళకు పండుగ
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:31 AM
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడంతో మహిళలకు నిజమైన పండుగ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించడంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఆర్థిక శాఖ మంత్రి జెండా ఊపి, పథకాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్టీసీ అధికారులు పథకాన్ని ...
స్త్రీ శక్తికి శ్రీకారం
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేశవ్
అనంతపురం టౌన, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడంతో మహిళలకు నిజమైన పండుగ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించడంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఆర్థిక శాఖ మంత్రి జెండా ఊపి, పథకాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్టీసీ అధికారులు పథకాన్ని ప్రారంభించారు. అనంతపురంలో మంత్రి కేశవ్ తొలుత జెండ ఊపి, బస్సులను ప్రారంభించారు. బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... స్త్రీ శక్తి పథకం పేరుతో సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళలు ఆధార్, రేషన కార్డు, ఓటరు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక కష్టాలెదుర్కొంటున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని తెలిపారు. త్వరలోనే చేనేత
కార్మికులకు రూ.25వేలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ... స్త్రీ శక్తి పథకం అమలు వల్ల ప్రతి మహిళ మొహంలో సంతోషం కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ, ఆర్టీసీ ఇన్చార్జి రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి, డీఎం నాగభూపాల్, ఆర్డీఓ కేశవనాయుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన, మాజీ మేయర్ మదమంచి స్వరూప, తెలుగు మహిళ స్వప్న, నలుబోలు మధురాయల్, తొండపునాటి రమేష్ రాయల్, ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, సరిపూటి రమణ, సింగవరం రవి, కందుకూరి నాగరాజు, వడ్డే సిమెంట్ పోలన్న పాల్గొన్నారు.