Home » Tamil Nadu
ప్రముఖ సినీ నటి, అన్నాడీఎంకే (AIADMK) డిప్యూటీ ప్రచార కార్యదర్శి గౌతమి తాడిమళ్ల.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ తన పదవికి రాజీనామా చేశారు.
మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.
తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.
తన రాజకీయ ప్రవేశంపై కీలక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఇటీవల వెల్లడించిన రాఘవ లారెన్స్.. తాజాగా ఆ తేదీని వాయిదా వేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు.
మహిళల భద్రత కోసం 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ మంగళవారంనాడు ప్రారంభించారు.
నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనతో సరదాగా చదరంగం కూడా ఆడారు.
తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమి పక్షాలను డీఎంకే అనుమతించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నిరోధించాలనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని అన్నారు.
తమిళనాట సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అన్నాడీఎంకేకు గట్టి దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో సహా 300 మందికి పైగా సభ్యులు విజయ్ సారథ్యంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో శనివారంనాడు లాంఛనంగా చేరారు.
‘వియ్ ద పీపుల్’ పేరిట అన్నామలై ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి లక్షల మంది జైకొడుతున్నారు. బీజేపీ నుంచి తప్పుకున్న ఒక్క రోజులోనే కొత్తగా 14 లక్షల మంది వియ్ ది పీపుల్ వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.