Share News

Ooty: మీరు ఊటీ వెళ్తున్నారా.. అయితే.. ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే..

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:23 PM

ఊటీ వెళ్లే పర్యాటకులకు అటవీశాఖ కొత్త నిబంధనలను విధించింది. క్రిస్మస్‌, నూతన సంవత్సరం సెలవుల్లో ఊటీకి పెద్దసంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. అయితే.. వీరు కొన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తో్ంది. అటవీ శాఖ అనుమతించిన పర్యాటక ప్రాంతాలను మాత్రమే సందర్శించాలని నిబంధనలు విధించడం గమనార్హం.

Ooty: మీరు ఊటీ వెళ్తున్నారా.. అయితే.. ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే..

- ఊటీ వచ్చే పర్యాటకులకు నిబంధనలు

చెన్నై: క్రిస్మస్‌, నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ఊటీ(Ooty) వచ్చే పర్యాటకులకు అటవీ శాఖ పలు నిబంధనలు విధించింది. ప్రముఖ పర్యాటక కేంద్రం నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీకి ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఈ క్రమంలో, రానున్న క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా ఊటీకి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశముందని జిల్లా అధికారులు భావిస్తున్నారు.


nani1.2.jpg

ఈ క్రమంలో ఊటీకి వచ్చే సందర్శకులకు అటవీ శాఖ అనుమతించిన పర్యాటక ప్రాంతాలను మాత్రమే సందర్శించాలి, అటవీ ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ, డ్రోన్‌ ఎగురవేతపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపడతామని అటవీ శాఖ హెచ్చరించింది.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ

సూపర్‌ పవర్‌ అంతా ఈజీ కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2025 | 12:23 PM