Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం ధీమా.. ల్యాప్టాప్ల పంపిణీని ఎవ్వరూ అడ్డుకోలేరు
ABN , Publish Date - Dec 19 , 2025 | 01:28 PM
రాష్ట్రంలో.. ల్యాప్లాప్లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే ల్యాప్లాప్లు పంపిణీ చేస్తున్నారని వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
- డిప్యూటీ సీఎం ఉదయనిధి
చెన్నై: కళాశాల విద్యార్థులకు ల్యాప్లాప్లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, వచ్చే ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఉద్దేశంతోనే డీఎంకే ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఉచిత లాప్‌టా్‌పలను అందజేయనుందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.

ఈపీఎస్ విమర్శలపై స్పందించిన ఉదయనిధి గురువారం తన ఎక్స్‌పేజీలో, ల్యాప్‌టా్‌పల పంపిణీ పథకాన్ని ఈపీఎస్, ఆయన ఢిల్లీ ఓనర్ అడుకోవడం సాథ్యం కాదని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా విన్‌డోస్ 11ఓఎస్ ద్వారా నాణ్యమైన ల్యాప్‌టా్‌పలను పంపిణీ చేస్తామన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో లాప్‌టాప్ పంపిణీ పథకాన్ని సగంలోనే నిలిపివేసిన విషయాన్ని ఈపీఎస్ గుర్తు చేసుకోవాలని ఉదయనిధి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News