CM MK Stalin: నా విజయం వెనుక భార్య త్యాగం ఉంది..
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:33 AM
నా విజయం వెనుక భార్య త్యాగం ఉంది.. ఇల్లాలి మాటను భర్త శిరసావహించాలి.. అని అన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. భార్య చెప్పే మంచిమాటలను భర్త శిరసావహించాలని, అప్పు డే అన్యోన్య దాంపత్యం సాగుతుందన్నారు. కొళత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
- ఇల్లాలి మాటను భర్త శిరసావహించాలి
- నూతన వధూవరులకు స్టాలిన్ సలహా
చెన్నై: ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనేది సుప్రసిద్ధ నానుడి అని, ఆ కోవలోనే తన విజయపరంపరల వెనుక తన సతీమణి ఆదరణ, ప్రోత్సాహం, త్యాగం దాగి ఉందని, ఆమె ఓర్పుగా ఉండడం వల్లే తానింతటి ఉన్నత స్థితికి చేరుకోగలిగానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) అన్నారు. భార్య చెప్పే మంచిమాటలను భర్త శిరసావహించాలని, అప్పుడే అన్యోన్య దాంపత్యం సాగుతుందన్నారు. గురువారం కొళత్తూరు నియోజకవర్గంలోని రూ.25.72 కోట్లతో నిర్మించిన అన్నా కళ్యాణమండపాన్ని ప్రారంభించిన, ఆయన 15 జంటలకు వివా హం జరిపించారు.
అదేవిధంగా రూ.17.47 కోట్లతో జీకేఎం కాలనీలో ప్రభుత్వ ఆదర్శ మహోన్నత పాఠశాల, పెరియార్‌నగరంలో అముదం అంగడి (రేషన్‌షాపు) కూడా ఆయన ప్రాంభించారు. 15 జంటలకు వివాహాలు జరిపించి ఆశీర్వదించిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ ప్రతి పది రోజులకూ తన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి మంత్రి శేఖర్‌బాబు కారణమని, తన నియోజకవర్గంలో కనీసం 10 కార్యక్రమాలకు తగ్గకుండా ఏర్పాటు చేసి తనను ఆహ్వానించడం అలవాటుగా పెట్టుకున్నారని కొనియాడారు.

ఈనియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి మేరకు రాజీవ్‌గాంధీ స్మా రక సర్వజన ఆసుపత్రి (జీహెచ్) కంటే మరిన్ని సదుపాయాలతో పెరియార్ ఆస్పత్రి స్థాయిని పెంచామని తెలిపారు. నూతన వధూవరులకు తాను చెప్పదలచిందొకటేనని, భార్య మాటకు కట్టుబడితేనే మగవాడి జీవితం ధన్యమవుతుందని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరటానికి తన భార్యే కారణమని, ఎమర్జెన్సీ రోజుల్లో యేడాదిపాటు జైలు శిక్ష అనుభవించానని, తాను ఏ జైలులో ఉన్నానో కూడా తెలియని పరిస్థితుల్లో తన సతీమణి సహనం పాటించిందని, లేకుంటే తానింత ఉన్నత స్థితికి చేరేవాడిని కానన్నారు.
తనకు కష్టాలు ఎదురైనప్పుడల్లా ఆమె ఉత్సాహపరస్తూ ఉండేవారని స్టాలిన్ వివరించారు. తన సమక్షంలో వివాహం చేసుకున్న 15 జంటలకు తానిచ్చే సలహా ఒక్కటేనని తమకు పుట్టబోయే బిడ్డలకు అందమైన పేర్లు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు, అన్బిల్ మహేష్, మేయర్ ఆర్ ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, జోసెఫ్ సామువేల్, వెట్రి అళగన్, డిప్యూటీ మేయర్ మహే్‌షకుమార్, కార్పొరేషన్ కమిషనర్ కుమారగురుబరన్, డిప్యూ టీ కమిషనర్ గట్టా రవి, మాజీ శాసనసభ్యుడు రంగనాధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News