Share News

Tiger: హమ్మయ్య.... పులి చిక్కిందిగా...!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:57 PM

ఓ మహిళను చంపేసిన పులి ఎట్టకేలకు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నీలగిరి జిల్లాలో గత నెల 24వ తేది పులి మహిళపై దాడిచేసి చంపేసింది. కాగా.. ఆ పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నించి ఎట్టకేలకు దానిని బంధించడంతో ఈ ఏరియా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Tiger: హమ్మయ్య.... పులి చిక్కిందిగా...!

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో మహిళపై దాడిచేసి హతమార్చిన పులి బోనులో చిక్కడంతో అటవీ శాఖ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కూడలూరు సమీపంలోని మావనల్లా ప్రాంతంలో గత నెల 24వ తేది నాగియమ్మాళ్‌(60) అనే వృద్ధురాలిపై పులి దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. మరో ప్రాణనష్టం జరుగకముందే పులిని బంధించాలని ఆయా ప్రాంతాల ప్రజలు అటవీశాఖకు విజ్ఞప్తి చేశారు. దీంతో, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఐదు ప్రాంతాల్లో బోనులు, 29 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పులి సంచారాన్ని పర్యవేక్షించారు.


నాగియమ్మాళ్‌పై దాడిచేసి హతమార్చింది ముసలి మగపులిగా గుర్తించారు. అనంతరం 40 మంది సిబ్బందిని నాలుగు బృందాలుగా విభజించి పులిని బంధించేందుకు గస్తీ చేపట్టారు. కానీ, బోనులో చిక్కని పులి, ఆ ప్రాంతంలోని ఆవులు, మేకలను హతమార్చింది. ఆవులు, మేకలను సంరక్షిస్తున్న ఆ ప్రాంత ప్రజలు పులి సంచారంతో కంటిపై కునుకు లేకుండా ఉండిపోయారు. ఆ ప్రాంత విద్యార్థులను కూడా అటవీ శాఖ వాహనాల్లో పాఠశాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం పాఠశాల పరిసరాల్లో పులి సంచరించడం చూసిన విద్యార్థులు బెంబేలెత్తిపోయారు.


nani3.jpg

ఈ క్రమంలో, గురువారం వేకువజామున వానవల్లా ప్రాంతంలో ఏర్పాటుచేసిన బోనులో పులి చిక్కడాన్ని అటవీ సిబ్బంది గమనించారు. పశువైద్యులు, అధికారులు అక్కడకు చేరుకుని పులిని పరిశీలించారు. 12 ఏళ్ల వయస్సున్ను పులి అని, వేటాడలేని స్థితిలో జనావాసాల్లో ప్రవేశించి ఆవులు, మేకలపై దాడిచేసిందని అధికారులు నిర్ధారించారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులతో పులిని వండలూరు జూ పార్క్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2025 | 12:57 PM