Home » Tamil Nadu
తమిళ రాష్ట్రంలోని థెన్‌కాసి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కి వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ గళం విప్పింది. 'సర్' ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వానికి స్థలం విరాళంగా అందజేసిన దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. తిరుప్పూర్ కార్పొరేషన్ 8వ వార్డు ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేకపోవడంతో, వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.
చెన్నై నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు చెన్నై మహానగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఇదివరకు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఆ తర్వాత వాటిని తీసివేశారు. కాగా... మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను సిటీలో సేవలందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్‌లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే.
ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.
అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి.